23 June, 2026 | 10:22 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

చైతన్యపురిలో అగ్నిప్రమాదం

01-11-2024 11:05 AM

పటాకులు పడి ఫర్నిచర్ షోరూమ్ దగ్ధం 

ఎల్బీనగర్: చైతన్యపురి మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈస్ట్ వుడ్ ఫర్నిచర్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. దీపావళి రోజున గురువారం రాత్రి స్థానికులు పటాకులు కాల్చే సమయంలో నిప్పు రవ్వలు షోరూమ్ లో పడడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.