03-11-2025 01:28:23 AM
కెమికల్ డ్రమ్ములకు నిప్పంటుకొని మంటలు
పటాన్‌చెరు రూప కెమికల్స్‌లో ఘటన
సంగారెడ్డి, నవంబర్ 2 (విజయక్రాంతి)/పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని రూప కెమికల్స్ పరిశ్రమలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో కెమికల్ డ్రమ్ములకు నిప్పంటుకొని ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేసేందుకు మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినా కెమికల్ డ్రమ్ములు ఉండటం వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఫ్యాక్టరీని గత ఆరు నెలల క్రితం మూసి వేశారని, కెమికల్ డ్రమ్ములను నిల్వ ఉంచుతున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో కార్మికులెవరూ లేరని, సెక్యురిటీ గార్డులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. అయితే ఏదైనా ఆస్తినష్టం జరిగిందా అనేది తేలాల్సి ఉంది.