03-11-2025 01:29:20 AM
మరిపెడ, నవంబర్2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం మరిపెడ బంగ్లాలో ఆంజనేయ స్వామివారి జన్మ నక్షత్రం ( పూర్వభద్ర నక్షత్రం) సందర్భంగా ఆదివారం తులసి దామోదర కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు.ముందుగా ఆలయ అర్చకులు సుదర్శన్ బట్టార్ ఆధ్వర్యంలో పంచామృతాలతో స్వామివారికి అభిషేకం, అర్చలు చేశారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.దామోదర తులసిలను వెండి, పట్టు వస్త్రాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం తులసి దామోదర కళ్యాణ్ నాని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
లోక కళ్యాణ కోసం,సకల జీవకోటి సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని చేపట్టిన కార్యక్రమాలకు భక్తజనం తరలివచ్చి అత్యంత భక్తి ప్రవత్తులతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తు లకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంచార్జ్, మాజీ ఉప సర్పంచ్ గంట్ల రంగారెడ్డి, సెక్రెటరీ, కోశాధికారి ఉల్లి శ్రీనివాస్,బోడ రూప్ల నాయక్, కొంపెల్లి వేణుగోపాల్ రెడ్డి,గర్రెపల్లి సత్యనారాయణ, గూడూరు నాగేశ్వర్ రావు,ఉల్లి విద్యారాణి,గర్రెపల్లి జానకి రాములు,గర్రెపల్లి నర్సయ్య, బుచ్చిరాములు,వెంకన్న, బూరుగు దిలీప్, గుగులోత్ భారత్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.