calender_icon.png 24 August, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం

24-08-2025 12:41:35 AM

యాదాద్రి జిల్లా జైకేసారంలోని ఎస్‌ఆర్ లాబరేటరీలో ఘటన

చౌటుప్పల్, ఆగస్టు 23 (విజయక్రాంతి): యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని జై కేసారం గ్రామంలోని ఎస్‌ఆర్ లాబరేటరీలో శనివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు రావడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళన గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.