24-08-2025 12:41:09 AM
గార్ల (మహబూబాబాద్), ఆగస్టు 23 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో శనివారం ఓ సీఐ లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లాలోని డోర్నకల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ బెల్లం వ్యాపారి నుంచి స్టేషన్ బెయిల్ కోసం 50వేల రూపాయలు డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో 30 వేలను బాధితుడి నుంచి లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సీఐ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అలాగే కానిస్టేబుల్ రవిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికా రుల సోదాలు కొనసాగుతున్నాయి.