calender_icon.png 24 January, 2026 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

24-01-2026 03:06:26 PM

హైదరాబాద్: ఎప్పుడు రద్దీగా ఉండే నాంపల్లిలోని(Nampally) బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో శనివారం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. నాలుగు అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా విస్తరించడంతో చుట్టుపక్కల వాళ్లు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన నాలుగు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో ఇద్దరు పిల్లలు, తల్లి చిక్కుకుున్నట్లు స్థానికులు వెల్లడించారు. పరిసర ప్రాంతాల వాసులను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఘటనాస్థలిలో భారీ క్రేన్లతో సహాయచర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.