calender_icon.png 24 January, 2026 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ దారుణ హత్య..

24-01-2026 03:38:04 PM

రుక్మాపూర్  రైల్వే స్టేషన్ అటవీ ప్రాంతంలో ఘటన.. 

గొంతు కోసి దారుణంగా హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు.. 

తాండూర్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం రుక్మాపూర్ గ్రామ శివారు నిర్మానుష్య అటవీ ప్రాంతంలో ఓ మహిళను గొంతు కోసి హత్య చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.మహిళ శరీరంపై  కత్తిగాట్ల గాయాలు ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి.. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పాడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతురాలు దగ్గర ఉన్న ఆధార్ కార్డు ద్వారా యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన లొంక బందెమ్మగా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.