15-12-2024 02:25:19 PM
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలం ఉప్పరిపల్లిలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. పెళ్లిళ్ల అలంకరణ సామగ్రి పెట్టిన ఆర్కే గోదాంలో విద్యుదాఘాతం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అర్పుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.