calender_icon.png 16 September, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంభమేళాలో పాల్గొంటాం: కిషన్ రెడ్డి

15-12-2024 04:28:46 PM

గంగా నదిలో స్నానం చేస్తే పవిత్ర ఫలితం

హైదరాబాద్: ఉత్తర్ ప్రదేశ్ లోని కుంభమేళాకు రాష్ట్రం నుంచి భారీగా వెళ్లే అవకాశముందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కుంభమేళాకు వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. యూపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు కుంభమేళాలో పాల్గొంటామని చెప్పారు. కుంభమేళాలో 30 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రయోగ్ ఘాట్ లో స్నానం చేస్తే మంచిదని భక్తుల నమ్మకం అన్నారు. ఆరు పుణ్య దినాల్లో గంగానదిలో చేయాలని చెబుతారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జనవరి 13,14, 29, ఫిబ్రవరి 3,12, 26 తేదీల్లో గంగా నదిలో స్నానం చేస్తే పవిత్ర ఫలితం దక్కుతోందని భక్తుల నమ్మకమని ఆయన పేర్కొన్నారు.