04-10-2025 02:01:49 PM
కోరుట్ల,(విజయక్రాంతి): జాతీయ అవార్డు పొందిన బలగం అనే సినిమా తరహాలోబొక్క కోసం బావ బామ్మర్దులు గొడవ పడ్డట్టు.. మటన్, చికెన్ విషయంలో నవ దంపతుల మధ్య గొడవ ఆత్మహత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన సంతోష్ గాయత్రి ఎదురెదురు ఇళ్లలో ఉండేవారు. ఆరు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకొని కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం ఎద్దండి గ్రామ ప్రజలను కలచి వేసింది. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి గత నెల 26వ తేదీన పెళ్లి చేసుకున్నారు. దసరా రోజు దంపతులిద్దరూ గాయత్రి తల్లి గారి ఇంటికి వెళ్లి భోజనాలు చేస్తున్న సమయంలో సంతోష్ మన ఇంట్లో మటన్ తెస్తే తినని నీవు మీ ఇంట్లో చికెన్ ఎలా తింటున్నావని గాయత్రిని ప్రశ్నించగా, అది కాస్త ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది.
గాయత్రికి మటన్ అంటే ఇష్టం
ఉండదని, చికెన్ తింటుందని దానితో ఇద్దరి మధ్య గొడవ కారణమైన ఆ కాస్త గొడవకు మనస్థాపన చెందిన గాయత్రి అత్తగారింటికి వెళ్లిన తర్వాత ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటుందని బంధువులు తెలిపారు.