04-10-2025 01:57:23 PM
హైదరాబాద్: నగరంలో శనివారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇవాళ ఉదయం నుంచి ప్రశాంతంగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఒకసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని తెలికపాటి వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, కొండాపూర్, మాదాపూర్, మెహిదీపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భాతర పశ్చిమ తీరానికి ‘శక్తి’ తుఫాన్ ముంచుకొస్తున్నది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారి తుఫాన్‌లా మారింది. ద్వారకకు నైరుతి దిశగా 240 కిలోమీటర్లు, పోర్‌బందర్‌కు పశ్చిమం వైపు 270 కిలోమీటర్ల దూరం నుంచి తీరం వైపునకు దూసుకొస్తున్నది. ఫలితంగా రానున్న 24 గంటల్లో దేశంలోని పలుచోట్ల బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.