04-10-2025 02:07:57 PM
అహ్మదాబాద్ టెస్టులో వెస్టిండీస్(India vs West Indies)పై భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. భారత్ 448/5 వద్ద డిక్లేర్డ్ ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 162కి, రెండో ఇన్నింగ్స్ లో 146 వద్ద ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ 4, బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో జడేజా 4, సిరాజ్ 3, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టాడు. భారత బ్యాటర్లు రాహుల్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ శతకాలతో రాణించారు. రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.