07-10-2025 01:33:10 AM
ఎనిమిది మంది దుర్మరణం
జైపూర్, అక్టోబర్ 5( విజయక్రాంతి): రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో ఆదివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఆస్పత్రి ట్రామా కేర్ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది మంది రోగులు అగ్నికీలల్లో చిక్కుకుని ఆహుతయ్యారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో చనిపోయినవారు షికర్‌కు చెందిన పింటూ, జైపూర్‌కి చెందిన దిలీప్, బహదూర్, భరత్‌పూర్‌కి చెందిన శ్రీనాథ్, రుక్మిణి, ఖుర్మాతో పాటు మరో ముగ్గురు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మృతుల్లో ఇద్దరు మహిళా రోగులు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి 11 మం ది రోగులు ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారని, వారందరినీ సురక్షితంగా తరలించామని ట్రామా సెంటర్ ఇన్‌చార్జ్ డాక్టర్ అనురాగ్ ధాకడ్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రి వర్గాలు, సిబ్బంది రోగులను రక్షించారని వైద్యులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బం ది కేవలం 2 గంటల్లోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారని, అలాగే తాను, మిగిలిన సిబ్బంది పలువురు రోగులను మంటల నుం చి కాపాడామని వార్డ్ బాయ్ వికాస్ చెప్పారు.
అయితే, ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని డాక్టర్ అనురాగ్ ధాకడ్ అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో విచారణ కమిటీని నియమించింది. ఘటనపై ప్రధాని మోదీ ఎక్స్‌వేదికగా స్పందించారు. రాజస్థాన్ లోని జైపూర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి పలువురు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగా నో బాధించిందన్నారు.
మృతుల కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ ప్రమాదం జరిగిన ఆస్పత్రి ని సందర్శించి రోగులు, డాక్టర్లతో మాట్లాడా రు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నా రు. ఇది ఊహించని ఘటన అని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.