calender_icon.png 7 October, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

07-10-2025 01:31:34 AM

  1. విజేతలైన శాస్త్రవేతలు మేరీ ఇబ్రన్కో, ప్రెడ్ రామ్స్‌డెల్, షిమన్ సకాగుచి
  2. రోగ నిరోధక శక్తిపై పరిశోధనలకు గుర్తింపు

న్యూఢిల్లీ, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : రోగ నిరోధక శక్తిపై పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం దక్కింది. ఈ మేరకు స్వీడన్‌లోని స్టాక్ హోంలో సోమవారం నోబెల్ బృందం ఈ ప్రకటన చేసింది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దాని సొంత అవయవాలపై దాడి చేయకుండా నిరోధించడానికి దానిని ఎలా అదుపులో ఉంచుతారో వివరించే సంచలనాత్మక ఆవిష్కరణలకు గాను వైద్యశాస్త్రం ముగ్గురు శాస్త్రవేత్తలు మేరీ ఇబ్రన్కో, ప్రెడ్ రామ్స్‌డెల్, షిమన్ సకాగుచిలకు నోబెల్ పురస్కారం అందుకోను న్నారు.

మేరీ ఇబ్రన్కో ప్రస్తుతం సీటెన్లోని ఇనిస్టిట్యూట్ ఫర్ సిస్టమ్ బయాలజీలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 1961లో జన్మించిన ఈయన అమెరికాలోని ప్రిన్సన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు. అదే విధంగా 1960వ సంవత్సరంలో జన్మించిన మరో శాస్త్రవేత్త ప్రెడ్ రామ్స్‌డెల్ 1987 లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా తీసుకున్నారు. ప్రస్తుతం ఈయన శాన్ ఫ్రాన్సిస్కోలోని సోనోమా బయోథెరప్యూటిక్సో శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. 

నోబెల్ బహుమతి అందుకున్న షిమన్ సకాగుచి 1951లో జన్మించారు. ఈయన 1983లో జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఒకాసా విశ్వవిద్యాలయంలోని ఇమ్యునాలజీ ఫ్రాంటీయర్ రీసెర్చ్ సెంటర్‌లో విశిష్ట ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.