25-11-2025 12:00:00 AM
మేడ్చల్, నవంబర్ 24(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలో దారుణం జరిగింది. కారు దగ్ధమై ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం హనుమకొండకు చెందిన దుర్గాప్రసాద్ (30) వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వచ్చి తిరిగి దుండిగల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నాడు.
శామీర్‌పేట్ దాటిన తర్వాత సోమవారం తెల్లవారుజామున కారులో నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ వాహనం కాలిపోగా అందులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారులో హీటర్ ఆన్ చేసి ఉండడంతో దీనివల్ల ప్రమా దం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలు పూర్తిగా కాలిపో యినందున మృతుడిని గుర్తించడానికి పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కారు నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. అతడికి తల్లిదండ్రులు, సోదరులు ఉన్నారు. శామీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.