25-11-2025 12:00:00 AM
భీమదేవరపల్లి, నవంబర్ 24 (విజయ క్రాంతి) హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్ర స్ట్ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికలవిద్యాలయంభీమదేవరపల్లి పదవ తరగతి చదువుతున్న 39 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు గంగిశెట్టి జగదీశ్వర్ ట్రస్టు నిర్వాహకులు స్పెషల్ ఆఫీసర్ పి జ్యోతి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు.
ఈ సందర్భంగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము మా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందిస్తూ పరీక్షలకు ముందుగానే సన్నద్ధం చేయడము ట్రస్టు వారిని అభినందిస్తున్నానని తెలిపారు.
ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ సెక్టార్లలో చదువుతున్నటువంటి పదవ తరగతి విద్యార్థులకు 2011 సంవత్సరం నుండి పరీక్ష ప్యాడ్లు అందిస్తున్నానని ఈ విద్యా సంవత్సరము 10,000 పరీక్ష ప్యాడ్లు ప్రభుత్వ సెక్టార్లలో చదివే విద్యార్థులకు అందించడం లక్ష్యం అని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల,విద్యార్థులు పాల్గొన్నారు.