01-05-2025 01:29:13 AM
కార్వాన్, ఏప్రిల్ 30(విజయక్రాంతి) : ఓ ఫర్నిచర్ గోదాంలో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగిన ఘటన ఆసీఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆసిఫ్‌నగర్ జిర్ర ప్రాంతానికి చెందిన ఎండీ తాజ్ అనే వ్యక్తికి ఫర్నిచర్ గోదాం ఉంది.
మంగళవారం రాత్రి షాప్‌కు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి కాలిపోయింది. 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాణ నష్టం జరుగకపోవడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.