calender_icon.png 23 November, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

10-02-2025 12:41:15 AM

భారీగా ఆస్తి నష్టం 

 రాజేంద్రనగర్, ఫిబ్రవరి 9: ఓ ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. పారిశ్రామికవాడలో ఉన్న ఓ సెలూన్ కుర్చీలు తయారు చేసే కంపెనీ గోడౌన్‌లో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంట లు చెలరేగాయి.

దట్టమైన పొగ అల్ముకొని మంటలు చెలరేగడంతో ఇరుగుపొరుగున ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యా రు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు ఫైర్ ఇంజన్లు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను అతి కష్టం మీద అదుపులోకి తీసుకొచ్చాయి. కోట్లలో ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.