10-02-2025 12:44:31 AM
యాచారం, ఫిబ్రవరి 9: నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదామును ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. సహకార సంఘం చైర్మన్ రాజేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రూ.77 లక్షల 50 వేల నిధులతో నిర్మించిన గోదాం.. ఎరువుల్ని నిలువ ఉంచేందుకు రైతులకు ఉపయుక్తంగా ఉండనుందన్నారు.
సహకార సంఘాల ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు ఎరువులు, విత్తనాలను అందజేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో రైతులకు అనేక సంక్షేమ ఫలాలు అందను న్నాయన్నారు. ఏఎంసీ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ కారింగు యాదయ్య, సహకార సంఘం డైరెక్టర్లు మక్కపల్లి స్వరూప, మద్దెల శశికళ, కొండాపురం కలమ్మ ఇతర డైరెక్టర్లతో పాటు సీఈఓ నాగరాజు సహకార బ్యాంకు సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.