calender_icon.png 23 November, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంగు బంగారం ‘శ్రీలక్ష్మీతిరుపతమ్మగోపయ్య స్వాములు’

10-02-2025 12:39:53 AM

  • ఈనెల 12 నుంచి 17వరకు చీడెళ్ళలో జాతర
  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ నిర్వహకులు

పెన్ పహాడ్, ఫిబ్రవరి9: అమ్మా.. శరణం అంటూ శ్రీలక్ష్మీ తిరుపతమ్మ తల్లిని వేడుకో.. కరుణించి కోరికలు తీర్చుతుంది. ఆతల్లి త్రిమాత శక్తి స్వరూపిణి శ్రీలక్ష్మీతిరుపతమ్మ తల్లి. ఆంధ్ర రాష్ట్రంలోని పెనుగంచిప్రోలులో కొలువుతీరిన అమ్మ శ్రీలక్ష్మీ తిరుపతమ్మాగోపయ్య స్వామీ జాతరను మైమరిపించే విధంగా సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని చీదేళ్ళలో తెల్లబండపై దివ్య తేజోస్వరూపిణిగా వెలసిన అమ్మ ’ శ్రీలక్ష్మీ తిరుపతమ్మాగోపయ్య స్వామీ’ జాతర ఉత్సవాలు ఈనెల 12న (బుధవారం) అమ్మవారి ఊలిగేంపుతో అంగరంగ వైభవంగా ప్రారంభంకానుండగా 17న వేలాది భక్తజన సందోహం నడుమ దేవతామూర్తుల కళ్యాణతంతుతో జాతర ముగియనుంది. ఇప్పటికే జాతర ఉత్సవాలకు సంబందించి అన్ని ఏర్పాటు చేశారు.

జాతర కార్యక్రమాలు

ఈనెల 12న బుధవారం అమ్మవారి ఊరేగింపు, 13న ప్రభబండ్ల ఊరేగింపు, 14న, రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ క్రీడలు ప్రారంభం, తంగెళ్ళగూడెంలో అమ్మవారి ఊరేగింపు, రాత్రి రవి మెలోడీస్ ఆధ్వ ర్యంలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్, 15న చెట్లము కుందాపురంలో అమ్మవారి ఊరేగింపు, అన్నదానం, 16న రామన్నగూడెంలో అమ్మవారి ఊరేగింపు, చిన్నసీతారం తండా లో అమ్మవారి ఊరేగింపు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్,  జబర్ధస్త్ కళాకారుల కార్యక్రమం , 17న దేవతామూర్తుల కళ్యాణంతో జాతర ముగింపు జరుగుతున్న ఆలయ కమిటీ చైర్మన్ మోదుగు నర్సిరెడ్డి, వైస్ చైర్మన్ దేశగాని రాజీవ్ గాంధీ, కోశాధికారి జాల సైదులు, కార్యదర్శులు గొట్టిపర్తి గోవిందు, కొండమీద పిచ్చయ్య తెలిపారు.