27-12-2025 08:19:29 PM
మత్స్యకారులకు ఉపాధి
గోపాలపేట: రాణి రంగనాయకమ్మ నిర్మించిన లక్ష్మీ సముద్రంలో మూడు లక్షల చేప పిల్లలను సర్పంచ్ లోకా రెడ్డి వదిలారు. శనివారం వనపర్తి జిల్లా గోపాలపేట మండలం మేజర్ తాడిపర్తి గ్రామంలో మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లలను విడుదల చేశారు. మేజర్ గ్రామపంచాయతీలో రాణీ రంగనాయకమ్మ నిర్మించిన లక్ష్మీ సముద్రంలో వనపర్తి జిల్లా మత్స్యశాఖ పంపిణీ చేసిన చేప పిల్లలను నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లోకా రెడ్డి ఆధ్వర్యంలో మూడు లక్షల చేప పిల్లలను వదిలారు.
అదేవిధంగా గోపాలపేటలో సర్పంచ్ కర్రోళ్ల స్వప్న, ఏదుట్ల గ్రామంలో పెద్దిరెడ్డి సునీత రాజు లో ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా సర్పంచ్ లోకా రెడ్డి మాట్లాడుతూ వీటి ద్వారా మత్స్యకారులు ఉపాధి పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారులు భరత్ రవిరాజు ఫీల్డ్ ఆఫీసర్ వీరేష్, తాడిపర్తి మత్స్యకార సంగం ఉపసర్పంచ్ దేశి రామచంద్రయ్య, జిల్లా మత్స్య సహకార సంఘం సలహాదారులు, జిల్లా చీఫ్ ప్రమోటర్ పుట్ట బాలరాజు అదేవిధంగా గ్రామ రామకృష్ణ పలువురి నాయకులు, పుట్టపాకుల శంకర్, ఉందే కోటి చంద్రయ్య, పుట్టపాకల చిన్నయ్య, పుట్టపాకుల రాములు, తదితరులు పాల్గొన్నారు.