calender_icon.png 27 December, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీరా నుంచి ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు

27-12-2025 08:15:28 PM

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

విజయక్రాంతి,పాపన్నపేట: మంజీరా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఎన్కేపల్లి గ్రామ శివారులోని మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని ఠాణాకు తరలించారు.

ట్రాక్టర్ లను సీజ్ చేసి ట్రాక్టర్ల ఓనర్లు బద్రి అంజయ్య, సలీం పాషాలపై, ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మండలంలో మంజీరా నది, చెరువుల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.