27-12-2025 08:24:42 PM
నిజామాబాద్,(విజయక్రాంతి): రెండు కార్డుల విధానాన్ని రద్దు చేయాలని 252 జిఓ ను సవరించాలని డిమాండ్ చేస్తూ టీయుడబ్ల్యూజేహెచ్-143 యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ లో కలెక్టరెట్ ఏవో ప్రశాంత్ కి జర్నలిస్ట్ సమస్యలతో కూడిన మెమోరాండం అందించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపారు. కొత్త జీవో పేరుతో జర్నలిస్టుల అక్రిడేషన్ లను కోత పెట్టడాన్ని టీయుడబ్ల్యూజే(హెచ్-143) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆర్.భూపతి తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండురకాలుగా జర్నలిస్టులను విడదీసి నూతన అక్రిడేషన్ పాలసీ తీసుకోవడం సరికాదన్నారు. సబ్ ఎడిటర్లకు, వర్కింగ్ జర్నలిస్ట్ లకు అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జీవో సవరణ జరిగే వరకు ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే తెంజు ప్రతినిధులు రజినీకాంత్, బాల కుమార్, కట్ట సతీష్, ఆనంద్ పాల్, అంజి, సతీష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.