calender_icon.png 21 May, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీ ఆర్టీసీలపై మరింత అవగాహన పెంచాలి

21-05-2025 04:36:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీజీ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మరెన్నో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఇన్చార్జ్ రీజినల్ మేనేజర్ ప్రణీత్(In-charge Regional Manager Praneeth) అన్నారు. బుధవారం నిర్మల్ డిపోను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. నిర్మల్ డిపో మేనేజర్ పండరి(Nirmal Depot Manager Pandari) ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆదాయ వ్యయంల గురించి ఆరా తీశారు. కండక్టర్, డ్రైవర్ల పనితీరును పరిశీలించారు. పలు ఫైళ్లను తనిఖీ చేశారు. పెళ్లిళ్లకు శుభాకార్యలు ఎక్కువ ఉండడం వల్ల బస్సులు ప్రయాణికులకు అనుగుణంగా సమయ పాలనతో నడపాలని సూచించారు. పెళ్లిళ్లకు శుభాకార్యాలకు అద్దెప్రాతిపతిక బస్సులు ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ రీజియన్ లోనే మొదటి స్థానములో ఈ డిపో ఉంది. ఇకముందు రాష్ట్రములోనే మొదటి స్థానములో ఉండాలని తెలిపారు. కార్యక్రమములో డిపోమేనేజర్ కే పండరి, అసిస్టెంట్ మేనేజర్ ఐ. రాజశేఖర్ ఉద్యోగులు పాల్గొన్నారు.