calender_icon.png 24 May, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా బెల్లంపల్లిలో..

24-05-2025 05:56:34 PM

పీసీసీ చీప్ మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Bomma Mahesh Kumar Goud) జన్మదిన వేడుకలను బెల్లంపల్లిలో అట్టహాసంగా జరుపుకున్నారు. శనివారం పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బండి రాము కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తల, అభిమానులు ఘనంగా జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్ష పదవి పొందిన తర్వాత పార్టీలో యువకులకు, మహిళలకు ప్రాధాన్యతమిస్తూ చురుకుగా పార్టీ కార్యకలాపాలలో పాల్గొనేలా  తోడ్పాటు అందిందన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోని కాంగ్రెస్ పార్టీలో మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుకున్నారు.