24-05-2025 05:41:52 PM
ములుగు/మహబూబాబాద్ (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం పూరేడుపల్లికి చెందిన సాధు రామకృష్ణకు చెందిన ఒక ఎద్దు, సిరికొండ మల్లయ్యకు చెందిన ఒక ఎద్దు విద్యుదాఘాతానికి గురై మరణించాయి. బాధితులు రామకృష్ణ, మల్లయ్య మాట్లాడుతూ... శనివారం ఉదయం మేత కోసం వెళ్లి మేత మేస్తున్న క్రమంలో విద్యుత్ స్థంభం తీగ తెగి కింద పడి ఉండటంతో ఆ తీగకు తగిలిన రెండు ఎద్దులు అక్కడికి అక్కడే మృతి చెందాయన్నారు. మృతి చెందిన ఒక్కో ఎద్దు విలువ 75 వేల రూపాయలు ఉంటుందని, నిరుపేద కుటుంబానికి చెందిన తమకు పరిహారం అందించి ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు ఆదుకోవాలని వేడుకున్నారు.