24-05-2025 05:38:52 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. టీజీ-ఐపాస్ పథకంలో పరిశ్రమల అనుమతులపై జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్టీ, ఎస్సీ, వికలాంగుల అభ్యర్థులకు టి-ప్రైడ్ కింద 48 యూనిట్లకు సబ్సిడీ మంజూరైందని తెలిపారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్ ఉపాధికి కీలకమని కలెక్టర్ బాదవత్ సంతోష్(Collector Badavath Santosh) తెలిపారు. విద్యార్థులు ఈ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.