calender_icon.png 24 May, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం

24-05-2025 05:36:25 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరమని బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నర్సింహారెడ్డి(BJP Mandal President Devudi Lavanya Narasimha Reddy) అన్నారు. శనివారం మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామానికి చెందిన రూ.15 వేలు, మాచిన్ పల్లి గ్రామానికి చెందిన స్వామి గౌడ్ కు రూ.15 వేలు, దొమ్మాట గ్రామానికి చెందిన పంజాల నర్సవ్వకు రూ.7 వేలు, గోవిందాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు బాలకృష్ణ కు రూ.9500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జ్ లక్ష్మణ్, తాజా మాజీ ఉపసర్పంచ్ స్వామి, భూత్ అధ్యక్షులు చంద్రం తదితరులు పాల్గొన్నారు..