calender_icon.png 15 July, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు సినిమాలు.. ఆరు భాషల్లో...

30-08-2024 12:00:00 AM

దర్శకుడు వి.సముద్ర స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తు న్న మూవీ ‘కుంభ’. ఈ చిత్ర ప్రా రంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరో విజయ్ రామ్‌పై ముహూర్తపు షాట్‌కు డీఎస్ రావు క్లాప్ కొట్టగా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి చంద్రమహేశ్, దేవిప్రసాద్ గౌరవ దర్శత్వం వహిం చారు. ఈ సందర్భంగా సముద్ర మాట్లాడుతూ.. “బలమైన కథలను నమ్ముకుని కొత్త వాళ్లతో 5 సినిమాలు చేస్తున్నా. అందులో ‘కుంభ’ ఒకటి. నా సినిమాలకు పనిచేసే టీమ్‌తోనే ‘కుంభ’ ప్రాజెక్టు చేస్తున్నా.

‘వరద రాజు గోవిందం’, ‘రామ జన్మభూమి’, ‘ఇండియా సీఈవో’ వంటివి ఆరు భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాలుగా చేయబోతున్నా” అని వివరించారు. మ్యూజిక్ డైరెక్టర్ వరంగల్ శ్రీను మాట్లాడుతూ.. “సముద్ర చేసివ న్నీ హిట్ టైటిల్సే. ఆయ న సినిమాలోని పాటలు సందర్భోచితంగా ఉంటా యి. సముద్ర సినిమాకు పనిచేయడం నా అదృష్టం” అన్నారు.

సముద్ర తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా, గర్వం గా ఉందని హీరో విజ య్ రామ్ తెలిపారు. ఈ చిత్రంలో సూరజ్ ఆదిత్య సింగ్ విలన్‌గా నటించనుండగా, జ్యోతి యాదవ్, రవి జంగ్, వరలక్ష్మి శరత్ కుమార్, ఎస్తేర్, రాజీవ్ కనకాల, అజయ్ ఘోష్, బాహుబలి ప్రభాకర్, కోట శ్రీనివాసరావు, దాసన్న, ఆదిత్య సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషించనున్నారు.