29-08-2024 12:00:00 AM
ఓ వైపు హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ మరోవైపు దర్శకుడిగా తానేంటో నిరూపించుకుంటున్నాడు తమిళ కథానాయకుడు ధనుష్. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పా.పాండి’, ‘రాయన్’ మంచి విజయాన్నందుకున్నాయి. ఇప్పుడు ఆయన నుంచి మూడో చిత్రం వస్తోంది. ‘నిలవుక్కు ఎన్మెల్ ఎన్నాడి కోబమ్’ అనే ఈ సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోంది. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రంలో ‘గోల్డెన్ స్పారో అనే ఓ సాంగ్ గురించి ఇప్పుడు అంతటా చర్చ సాగుతోంది.
ఇది ధనుష్ కొడుకు యాత్ర ధనుష్ రాయడమే ఇందుకు కారణం. ఫస్ట్ సింగిల్‌గా ఈ నెల 30న విడుదల కానున్న ఈ ప్రత్యేక గీతంలో ప్రియాంక అరుల్ మోహన్ చీరకట్టులో సరికొత్తగా ఆకట్టుకోనుంది. ఈ పాట సాహిత్యంతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటే మాత్రం యాత్ర ధనుష్.. తన విజయ యాత్ర ఆరంభించినట్టవుతుంది. ఇదే సమయంలో తండ్రికి తగ్గ తనయుడు అన్న మెప్పూ పొందటమూ ఖాయమే!