calender_icon.png 14 July, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దవారితో చూడగలిగే సినిమా ఇది

30-08-2024 12:00:00 AM

వైవిధ్యమైన పాత్రలతో అదరగొట్టే శ్రీవిష్ణు మరోమారు ‘శ్వాగ్’ చిత్రంతో అలరించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ గురువారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “మన అందరి ఇళ్లలో ఉన్న ఇలాంటి పాయింట్‌తో సినిమాలు చేయాలంటే చాలా దమ్ముండాలి. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం” అన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “ఇది కంటెంట్ డ్రివెన్ వెరైటీ మూవీ.

కమల్ హసన్ ‘ఇంద్రుడు చంద్రుడు’ లాంటి సినిమాలు చూసిన ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది‘’ అని తెలిపారు. ‘తరతరాలుగా వస్తున్న స్త్రీ పురుషుల ఆధిపత్య పోరు నేపథ్యంలో సాగే ఈ కథాంశం చాలా మాట్లాడుతుంది. ఇండియన్ కంటెంట్‌లో ఇప్పటివరకూ రాలేదు. తాతలు ముత్తాతలతోపాటు చూడగలిగే సినిమా ఇది’ అని డైరెక్టర్ హసిత్ గోలి అన్నారు. కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ వేదరామన్ శంకరన్, ఎడిటర్ విప్లవ్ పాల్గొన్నారు.