16 March, 2026 | 10:20 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ఐదుగురు దోపిడీ దొంగల అరెస్ట్

25-09-2024 12:55 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 24: ఐదుగురు దోడిపీ దొంగలను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న మేళ్లచెరువు మండ లం వెల్లటూరు గ్రామంలో తమ్మిశెట్టి వెంక య్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లోవారిని బెదిరించి 6.5 తులాల బ ంగారం, 30 తులాల వెండి, రూ.50 వేల న గదును ఎత్తుకెళ్లారు.

స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయింది. కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి అనంతగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో అనుమానాస్పదంగా ఐదుగురు నిందితులను విచారించగా దోపిడీ చేసింది వారేనని తేలింది. వారిలో ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన వేమవరపు నాగరాజు, వేమవరపు పుల్లారావు, బిక్షాలు, నల్లగొండ జిల్లాకు చెందిన రమావత్ మాతృ, నాగర్‌కర్నూలుకు చెందిన చిక్కల ఆంజనేయులు ఉన్నారు. వారిని అరెస్టు చేసి, 6.5 తులాల బంగారం, 30 తులాల వెండి, కారును స్వాధీనం చేసుకున్నారు.