28-09-2025 10:28:18 AM
హైదరాబాద్: మూసీ వరద తగ్గాక ఎంజీబీఎస్ బస్ స్టేషన్(MGBS Bus Station) తేరుకుంటుంది. బురద శుభ్రం చేసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎంజీబీఎస్ లోకి ఆర్టీసీ బస్టులను(RTC buses) అనుమతించే అవకాంశం ఉందని అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల నుంచి జిల్లాలకు బస్సులు నడుపుతున్న ఆర్టీసీ ఆరాంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్, జేబీఎస్ నుంచి జిల్లాలకు ఆర్టీసీ బస్సులు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు పికప్ పాయింట్ల వద్దకు వెళ్లాలని ఆర్టీసీ సిబ్బంది సూచిస్తున్నారు. మూసీ నది ఉద్ధృతితో ఎంజీబీఎస్ కు వెళ్లే శివాజీ బ్రిడ్జ్ పై భారీగా బురద పేరుకుపోయింది. ఎంజీబీఎస్ ప్లాట్ ఫారం 56, 58, 60 వద్ద భారీగా పేరుకుపోయిన బురదను సిబ్బంది తొలగిస్తున్నారు.
బురదను తొలగించాక బస్సులను అనుమతించే అవకాశం ఉందని, జిల్లాల నుంచి వచ్చే బస్సులను సీబీఎస్ వద్ద ఉంచుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీ నది(Musi River)కి వదర ప్రవాహం తగ్గింది. జంట జలాశయాల నుంచి మూసీ నదికి 4,847 క్యూసెక్కులు నీటిని అధికారుల విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీగా బురద పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరద, బురద పేరుకుపోవడంతో స్థానికులు శుభ్రం చేసుకుంటున్నారు.
రెండ్రోజుల క్రితం మూసీ వరదతో చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జ్ ను అధికారులు మూసివేశారు. జంట జలాశయాల నుంచి వరద తగ్గడంతో లోయర్ బ్రిడ్జ్ చెత్త, బురదతో నిండిపోయింది. దీంతో చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జ్ పైనుంచి రాకపోకలను పోలీసులు నిలిపివేయడంతో పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయి కోఠి నుంచి చాదర్ ఘాట్ వరకు వాహన రాకపోకలు స్తంబించిపోయాయి.