calender_icon.png 28 September, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ

28-09-2025 01:07:25 AM

  1. తెలంగాణ టూరిజం కాంక్లేవ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
  2. హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 

రంగారెడ్డి, సెప్టెంబర్ 27 (విజయక్రాం తి): హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నా రు. శనివారం గచ్చిబౌలిలోని శిల్పకళా వేదికలో తెలంగాణ టూరిజం కాంక్లేవ్-2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. “గోల్కొం డ, రామోజీ ఫిలిం సిటీ వంటి ప్రముఖ ప ర్యాటక ప్రాంతాలు హైదరాబాద్‌లో ఉన్నా యి.

ఎకో, మెడికల్, హెల్త్ టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించాం. హైదరాబాదులో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించి ఇది అత్యంత సురక్షితమైన నగరమని నిరూపించాం. హైదరాబా ద్‌లో రక్షణ శాంపుల్ భద్రతల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. శాంతిభద్రతల విషయంలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని కేంద్రం ప్రకటించిందన్నారు. ప్రపంచ నగరాలతో నగరం పోటీ పడుతుంది” అని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా టూరిజానికి ఒక పాలసీ లేదని అన్నారు. త ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చామని చెప్పారు. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన మంత్రి జూపల్లిని అభినందిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే కాదు, రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే సత్తా తెలంగాణకు ఉందని  చెప్పారు.

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “పర్యాటకులకు తెలంగాణ పరిసర ప్రాంతాలు స్వర్గసీమ లాంటివి. పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్న రాష్ట్రమిది. గత పది ఏళ్ల రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితి టూరిజం పై దృష్టి సారించకుం డా ఈ రాష్ట్ర ఔనత్యా న్ని ప్రపంచ పటం మీదకు తీసుకెళ్లకుం డా, పర్యాటకులను ఆకర్షించకుండా గాలికి వదిలేసింది” అని విమర్శించారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.