6 May, 2026 | 5:21 AM

రోడ్లపై వరద

02-09-2024 02:10 AM
  • పలు జిలాల్లో దెబ్బతిన్న రోడ్లు

నిలిచిపోయిన రాకపోకలు

ఇబ్బందులు పడ్డ ప్రజలు

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, సెప్టెంబర్ ౧: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలకు పలు చోట్ల వరద నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయా యి. కొన్ని చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మం డలం నెల్లికుదురు బాద్ మ ధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద లో చిక్కుకున్న కొందరిని స్థానిక పోలీసులు జేసీబీ సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

ములుగు జిల్లా బొగ్గులవాగు పరవళ్లు తొక్కుతోంది. గుండ్లవాగు వద్ద వరద తీవ్రతకు రోడ్డు దెబ్బతినడంతో మంత్రి సీతక్క పరిశీలించారు. చినబోయినపల్లి ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడటంతో ఆమె వెంటనే అధికారులతో మా ట్లాడి సహాయక చర్యలు చేపట్టారు. భూపాల్లపల్లి నుంచి పరకాల రహదారిపై వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతి పెరుగుతుండటంతో రేగొండ నుంచి ములుగు జిల్లాలకు వెళ్లే రహదారిపై సుల్తాన్‌పూర్ గోరికొత్తపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ముగ్ధుంపురం వద్ద లెవల్ కాజ్‌వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో నెక్కొండ, నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నెక్కొండ మండంల వెంకటాపురం గ్రామంలోని లో లెవెల్ కాజ్‌వేల మధ్య మహబూబాబాద్ వెలుతున్న ఆర్టీసీ బస్సు వరద ప్రవహంలో చిక్కుకుంది. ఆ బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉ ండగా బయటపడేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి నుంచి బస్సులో గడిపిన ప్రయాణీకులు ఉదయం పోలీసులు, గ్రామస్తులు సాయంతో సురక్షితంగా బయటపడ్డా రు.

హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వద్ద చెరువు అలుగు పడుతోంది. దీంతో ములుగు హనుమకొండకు వెళ్లే రహదారిపై వాహనాలకు అంతరాయం ఏర్పడింది. జనగామలో హైదరాబాద్ రోడ్డుపై భారీగా నీరు నిలిచి చెరువును తలపించగా.. ఆ నీటిని డ్రైనేజీల ద్వారా తరలించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వడ్లకొండ, గానుగుపహాడ్ మధ్యలో బ్రిడ్జి నిర్మాణం చేపడుతుండగా ప్రత్మామ్నాయం గా ఏర్పాటు చేసిన రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో జనగామ నుంచి హుస్నాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. 

నిజామాబాద్ జిల్లాలో 

నిజామాబాద్ జిల్లాలో ఇందల్వా యి నుంచి దర్పల్లికి వెళ్ళే రోడ్డులో లింగాపూర్ వాగు ఉధృతంగా ప్రహిస్తుండటంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని కొండచరియలు విరిగి పడుతుండటం తో ప్రయానాల ను అధికారులు మన్ననూరు వద్దే నిలిపివేశారు. వనపర్తి జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామ చెరువు అలుగు పారడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మదనాపురం దంతనూర్ శంకరమ్మ పేట, మదనాపురం ఆత్మకూర్ రహదారులు బంద్ అయ్యాయి. గద్వాల జిల్లా ఉండవల్లి మండలం మెన్నిపాడు, బొంకూర్, మానవపాడు, అమ రవాయి  గ్రామాల మధ్య వాగు ఉగ్రరూపం దాల్చడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.

గద్వాల జిల్లాలో బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద నీటి మట్టం పెరిగినందున ఎర్రవల్లి నుంచి 5 గ్రామాలకు షేక్‌పల్లి, దువా స్‌పల్లి, వీరాపురం, ససనూల్, కరుపాకుల గ్రామాలకు వెళ్లే వాహనాల రాకపోకలను నిషేధించారు. మహబూబ్‌నగర్ నుంచి తాండూర్‌కు వెళ్లే జాతీయ రహదారి 167 రోడ్డు మార్గంలో నూతన బ్రిడ్జిలను నిర్మించేందుకుగాను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వరద దాటికి కొట్టుకుపోయాయి. ఆదిలాబాద్ జిలా జైనథ్ మండలంలోని అనంద్‌పూర్ గ్రామ సమీపంలోని పెన్ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అనంద్‌పూర్ గ్రామ వంతెన పైను ంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో తెలంగాణ రాకపోకలు నిలిచిపోయయి.

నిజామా బాద్ రూరల్ నియోజకవర్గంలో లింగాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇందల్వాయి మండలంలో ఇందల్వాయి మధ్య ఏర్పాటు చేసిన కల్వర్టు కోతకు గురయ్యింది. దీనితో ఇందల్వాయి ధర్పల్లి మధ్య అధికారులు రాకపోకలను నిలిపివేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యా మాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య లో లెవెల్ వంతెన తెగిపోవడంతో 6 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతోపాటు కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలోని లో లెవెల్ వంతెన పై నీరు పారడంతో రాయికల్ మండలానికి రాకపోకలు నిలిచిపోయా యి.

మేడిపల్లి మండలంలోని కమ్మర్ పేట వెంకట్రావుపేట, రత్నాలపల్లి, గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ వంతెనలపై భారీగా నీరు పార డంతో సుమారు 16గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నిర్మల్ జిల్లా కుంటాలలో ఆర్టీసీ బస్సు రెండు వాగుల మధ్య చిక్కుకుంది. కామాడ్డి జిల్లా రామారెడ్డి, కామారెడ్డి రహదారిపై రంగచెరువు కల్వర్టు నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ంది. కామారెడ్డి, టేక్రియాల్ బైపాస్ చౌరస్తా వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు కుంగిపోయింది. పక్కనే కల్వర్టు నిర్మా ణం పనులు జరుగుతుండగా వరుద ఉధృతికి కొట్టుకుపోయింది.

ఎల్లారెడ్డి, రహదారి పై కళ్యాణి ప్రాజెక్ట్ నీరు రావడంతో తిమ్మారెడ్డి గ్రామానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాగిరెడ్డిపేట మండలం పల్లె పొగడ తాండ వద్ద రోడ్డు వర్షానికి కొట్టుకపోయింది. రాకపోకలకు అంతరాయం కల్గింది. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు మా ర్గంలో గల మందిరకలపాడు వద్ద కల్వర్టు కొట్టుకుపోవడంతో ఉల్వనూరు, చంద్రాలగూడెం,రేగులగూడెం, బజంర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లాలో అర్వపల్లి రవదారిపై కేశవాపురంవద్ద, తిమ్మాపురం రహదారిపై కొమ్మాల, కోడూరు, సంగెం వద్ద వాగులు ప్రవహించగా ఈ ప్రాంతంలో రాకపోకలు పూ ర్తిగా నిలుచిపోయాయి. కోదాడ రహదారిపై  తమ్మెర వద్ద రోడ్డుపై నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు.