మరో రెండు రోజులు భారీ వర్షాలే
9 జిల్లాల్లో రెడ్ అలర్ట్
12 జిల్లాల్లో ఆరెంజ్, మరో 12 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరిక
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో ఎడతెరిలేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. సోమవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. 9 జిల్లాల్లో రెడ్ అలెర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మరో 12 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ను ప్రకటించారు.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులలో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనప ర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కుమురం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములు గు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలను ఆరేంజ్ అలెర్ట్ కింద ప్రకటిం చింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి.
ఈ జిల్లాలో నేడు, రేపు భారీ వర్షాలు
గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలు.. సోమ, మంగళవారాల్లోనూ ఉం టాయని వాతావరణ శాఖ పేర్కొంది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. మంగళవారం కూడా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ ల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటయని స్పష్టం చేసింది.
శనివారం అత్యధికంగా వర్షపాతం
శనివారం ఉదయం 8:30 నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో అత్యధికంగా 43.8 సెంటీమీటర్ల వర్షం కురిసిం ది. ఆ తర్వాత, చిన్నగూడురులో 42.85 సెం.మీ., నెల్లికుదురులో 41.65 సెం.మీ. పెద్ద నాగా రం 40.28 సెం.మీ., కొమ్మల పంచ 38.93 సెం.మీ., దంతాలపల్లి 33.25 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాల పరంగా అత్యధికంగా మహబూబాబాద్‌లో 27.25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాగులో 43.55 సెం.మీ., కల్లెడలో 27.88 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని కావర్‌వాయి ఏరియాలో 42.2 సెం.మీ., బచ్చోడలో 33.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల మండలం ముకుందాపురం ఏరియాలో 42.5, హుజూర్‌నగర్‌లో 31, చిల్కూర్ 29.7, మట్లంపల్లి ఏరియాలో 28.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతా వరణ కేంద్రం తెలిపింది.
ఆదివారం ఆయా ప్రాంతాల్లో వర్షం
ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా: సర్వాపూర్ - 15.3, గంధారి - 13.6, కామారెడ్డి- 13.4, లింగంపేట
- 12.7, తాడ్వాయి - 12.1, రామారెడ్డి - 12 సెంటీమీటర్లు.
సిద్దిపేట: మిరుదొడ్డి - 15.2, సిద్దిపేట రూరల్ - 13.9, నారాయణరావు పేట - 13.8,
గండిపెల్లి - 12.9, కొండపాక - 11.6, దుల్మిట - 11.1, శనిగరం - 10.8 సెంటీమీటర్లు.
నిజామాబాద్: చిమ్మాన్‌పల్లి - 12.9, తూమ్‌పల్లి - 12.3 సెంటీమీటర్లు
మెదక్: జిన్నారం - 13.4; వరంగల్: సంగెం - 10.9;
జనగాం: గూడూరు - 10.9;
రాజన్న సిరిసిల్ల: నేరెల్ల - 10.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.






