29-09-2025 01:07:35 AM
-మూడు లక్షల క్యూసెక్కుల నీళ్లు ఇన్‌ఫ్లో
-4,59,763 క్యూసెక్కుల నీళ్లు అవుట్‌లో
నిజామాబాద్ సెప్టెంబర్ 28:(విజయ క్రాంతి): తెలంగాణ జిల్లాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు తోడుగా వరద నీరు ఎగువ నుంచి దిగువకు గోదావరి నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులోకి మూడు లక్షల పైగా క్యూసెక్కుల నీరు వచ్చి తీరుతోంది. లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు వరద నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3 లక్షల వేల క్యూసెక్కుల కు పైగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1084.80 అడుగులకు చేరుకోవడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అప్రమత్తమైన అధికారులునీటిని విడుదల చేయడానికి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు.వరద ఉద్ధృతి దృష్ట్యా, ప్రాజెక్టు 39 గేట్లను ఎత్తి గోదావరిలోకి 4 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఇతర మార్గాల ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మొత్తం అవుట్ ఫ్లో 4,59,763 క్యూసెక్కులుగా అధికారులు తెలిపారు.
ఈ నీటి విడుదలతో గోదావరి పరివాహక ప్రాంతాలు అయిన కోడిచర్ల, సావెల్ గ్రామాల మధ్య రోడ్డుపైకి వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహంతోదీంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ప్రాజెక్టులో ప్రస్తుతం 59.23 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గుత్పే, లక్ష్మీ,అలీ సాగర్ కాలువలకు నీటిని విడుదల చేయడం లేదు.
ఐఎఫ్‌ఎఫ్సీ ద్వారా 500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ 4000,సరస్వతి కాలువ 400, ఎస్కేప్ గేట్స్ ద్వారా 4000 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 632 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.