29-09-2025 01:06:14 AM
వనవాసీ కళ్యాణ్ పరిషత్ అఖిల భారతీయ మార్గదర్శక్ పొన్నపల్లి సోమయాజులు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాం తి): వంద సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) హిందవులూ సంఘటన కోసం పని చేస్తోందని వనవాసీ కళ్యాణ్ పరిషత్ అఖిల భారతీయ మార్గదర్శక్ పొన్నపల్లి సోమయాజులు అన్నారు. శక్తి కోసం నిత్య శాఖలో ప్రార్థన సైతం చేస్తున్నామని తెలిపారు. ఆదివారం స్థానిక టేలర్స్ కాలనీలో ఆర్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ దశమి ఉత్సవానికి ఆయన వక్తగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ముమ్మడి నర్సింగ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పొన్నపల్లి సోమయాజులు మాట్లాడుతూ... సమాజంలో అధర్మం నాశనం కావాలంటే సమాజం సంఘటితంతోనే సాధ్యమన్నారు. సమాజాన్ని శక్తిమం తం చేయడానికి, వ్యక్తి నిర్మాణం కోసం, వ్యక్తిలో దైవశక్తి ని నింపడానికి హెడ్గేవార్ సంఘ్‌ను స్థాపించారని గుర్తు చేశారు. హిందూ సమాజం ఆత్మ విస్మృతి, భయం భయంగా వున్న రోజుల్లో సంఘ స్థాపన జరిగిందని, ఇప్పుడు తాను హిందువును అని గర్వాంగా చెప్పుకునే స్థాయికి సంఘం ఎదిగిందని అన్నారు.
ఉపేక్ష, వ్యతిరేక భావన నుండి ఇప్పుడు అందరూ స్వీకరించే స్థాయికి సంఘ్ ఎదిగిందని తెలిపారు. సంఘ్ పై ఎమర్జెన్సీ విధించినా, స్వయం సేవకులను అరెస్ట్ చేసినా, అణిచి వేసిన, సంఘ్ ఎదుగుతూనే వచ్చిందన్నారు. స్వయం సేవకుల త్యాగాల వల్ల సమాజంలో చాలా పరివర్తన సాధ్యమవుతోందన్నారు. హెడ్గేవార్ ఊహించిన స్థితి ఇప్పుడిప్పుడే వస్తోందన్నారు.
ఆరెస్సెస్ సమాజంలో సద్భావన, సామాజిక సమరసత కోసం పని చేస్తోందని, పంచపరివర్తన్ ద్వారా సమాజంలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భారత్ అత్యంత దేశమని, ఇతర మతస్థులు దాడులు చేసినా, తట్టుకుని నిలబడిందని అన్నారు. భారత్ ధర్మంగా వుంటే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా వుంటుందన్నారు.
ఇప్పుడిప్పుడే ఆరెస్సెస్ గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత బాగా పెరిగిందని, సంఘ్ పై విదేశాల్లో అధ్యయనం సైతం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ సంఘచాలక్ ప్రతాప్ రెడ్డి, స్వయం సేవకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
వ్యక్తి నిర్మాణం ద్వారనే దేశ నిర్మాణమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి):వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రచార ప్రముఖ్ దుర్గం పురుషోత్తం అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ ఎస్ ఎస్.జనగామ ఖండ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని సత్యసాయిబాబా దేవాలయం లో విజయదశమి ఉత్సవం జరిగింది.
కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు, హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందని పేర్కొన్నారు, హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు.
దేశ అభివృద్ధి కొరకు హిందు వులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత, కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవ నం మరియు పర్యావరణ పరిరక్షణ,పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు, జనగామ ఖండ కార్యకారిణి, ప్రజలు పాల్గొన్నారు.