calender_icon.png 3 August, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బినామీ ఆస్తులపైనే గురి

13-12-2024 02:47:27 AM

* మొదటి రోజు ముగిసిన నిఖేశ్ విచారణ

* భారీగా కూడబెట్టిన ఆస్తులపై ఏసీబీ ప్రశ్నల వర్షం

* రోజు రూ.౨ లక్షలకు తగ్గకుండా సంపాదన

* మరో మూడ్రోజులు కొనసాగనున్న విచారణ

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృ ష్టించిన ఇరిగేషన్ ఏఈఈ నిఖేశ్‌కుమార్ అవినీతి వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదాయానికి మిం చిన ఆస్తుల కేసులో అరెస్టయిన నిఖేశ్‌ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న ఏసీ బీ అధికారులు గురువారం నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారించారు. మొ దటి రోజు విచారణలో నిఖేశ్ కూడబెట్టిన ఆస్తులపై ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే బినామీ ఆస్తులపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. ఇప్పటికే నిఖేశ్‌కుమార్ బినామీ ఆస్తుల వివరాలను అధికారులు సేకరించారు.

అతడి స్నేహితుల బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసి భారీగా బంగారంతోపాటు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గండిపేట ఏఈఈగా నిఖేశ్‌కుమార్ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఈ క్రమం లోనే బడా బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారుల అక్ర మ కట్టడాలపై దృష్టి సారించింది. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలో భారీ నిర్మాణాల కోసం వారు  పెద్దమొత్తంలో లంచాలు ఇచ్చి ఉం టారనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యం లో ఆయా దరఖాస్తుల గురించి వివరా లు సేకరిస్తున్నారు. అనంతరం ఉన్నతాధికారులకూ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరో మూడు రోజుల పాటు నిఖేశ్‌ను ఏసీబీ విచారించనున్నది. 

రోజు రూ.౨ లక్షలకు తగ్గకుండా..

నిఖేశ్‌కుమార్ గండిపేట ఏఈఈగా పనిచేసినా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని రికార్డులను డీల్ చేసేవాడని తెలుస్తోంది. అతడి ద్వారా దస్త్రం పంపిస్తే వెనక్కి వచ్చేదికాదని చెప్తున్నారు. ఉన్నతాధికారులను నయానో బయానో ఒప్పించడంలో నిఖేశ్ దిట్టగా పేరొందాడు. ఈక్రమంలో కొన్ని కీలక ఫైళ్లను క్లియర్ చేసేందుకు రూ.50 లక్షల వరకు వసూలు చేసి ఉన్నతాధికారులకు వాటాలు పంచాడనే ఆరోపణలున్నాయి. జలాశయాల పరిధిలోని బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణా లకు నిఖేశ్ సులభంగా అనుమతులను ఇ ప్పించడంతో బడా వ్యాపారులు ఎంత మొ త్తమైనా ముట్టజెప్పేందుకు వెనకాడేవారు కాదని చెప్తున్నారు.

ఉద్యోగంలో చేరిన అనతి కాలంలోనే అడ్డగోలు సంపాదనకు రుచిమరిగిన నిఖేశ్‌కుమార్‌తోపాటు అతడి సన్నిహి తుల ఇళ్లపై ఏసీబీ బృందాలు చేసిన దాడిలో రూ.17.73 కోట్ల అక్రమాస్తులు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఒక లాకర్‌లో మ రో కిలోన్నర బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. వీటన్నింటి విలువ బహిరంగ మా ర్కెట్‌లో రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆయన ఉద్యోగంలో చేరి పదేళ్లవుతోంది. ఈ క్రమంలో అతడి అక్రమార్జన లెక్కగడితే సగటున రోజు కు రూ.2 లక్షలకు తక్కువ కాకుండానే ఉన్న ట్టు తేలింది. 

ఇంత భారీగా కూడబెట్టేందుకు ని ఖేశ్‌కుమార్ ఎలాంటి కుయుక్తులు పాల్పడ్డాడో తేల్చే పనిలో ఏసీబీ అధికారులు ని మగ్నమయ్యారు. ఆయనే మరెవరికైనా బి నామీగా వ్యవహరించాడా? అన్న కోణంలో నూ విచారణ సాగుతోంది. ఏఈఈగా నిఖేశ్‌కు క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీచేసే అథారిటీ లేకపోయినా.. ఆయా దరఖాస్తులను ఫార్వ ర్డ్ చేసేందుకు, వాటిని క్లియర్ చేయించేందు కు భారీగా వసూళ్లు చేయడంతోపాటు ఉ న్నతాధికారుల తరపున వాటాలను సేకరిం చి ముట్టజెప్పినట్టు దర్యాప్తులో గుర్తించారు. ఉన్నతాధికారుల పాత్రపైనా ఏసీబీ ఆరా తీ స్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.