calender_icon.png 13 May, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ హాస్పిటల్స్‌పై దృష్టి సారించాలి

13-05-2025 12:00:00 AM

ఏరియా టీబీజీకేయస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి.

మణుగూరు మే 12 ( విజయ క్రాంతి): సింగరేణి కంపెనీ రిఫరల్ ద్వారా వెళ్ళిన కార్మికులకు అదనపు ఛార్జీలు  వడ్డించి  కార్మి కుల  నడ్డి విరుస్తున్న కార్పొరేట్ హాస్పిటల్స్ పై దృష్టి  సారించి తగు చర్యలు చేపట్టాలని మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి డిమాండ్ చేశారు.

సోమ వారం ఆయన విడుదల చేస్తున్న ప్రకటనలో దేశ, రాష్ట్ర ప్రగతి కోసం సైనికుల వలే ప్రా ణాలకు తెగించి కష్టించి పని చేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమను, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అదనపు ఛా ర్జీల పేరిట జనిగ లా పట్టి పీడిస్తు కార్మిక  కుటుంబాలను ఆర్థికంగా నష్ట పరుస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి హాస్పిటల్ ల పై సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

సింగరేణి  చైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం  సంస్థ ప్రగతి కోసం కష్టించి పనిచేసే కార్మి కులు  వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ప్రగతి సాధిస్తుందని వారి అరోగ్య శ్రేయస్సునే  సంస్థ  కు శ్రీరామ రక్ష అని భావించి కార్మిక కుటుంబాలకు మెరు గైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. 

ప్రతి ఏటా కోట్లాది రూ పాయలు కార్పొరేట్ హాస్పిటల్ లకు బిల్ లు చెల్లిస్తూ  కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని, కాని కొన్ని కార్పొరేట్ సూ పర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు మాత్రం రిఫ రల్  ద్వారా వైద్య సేవలు పొందడానికి వచ్చే  వారి నుంచి  అదనపు ఛార్జీలు పేరిట  డి చార్జీ చేసే సమయంలో  వసూళ్లకు  పాల్ప డుతూ కార్మిక కుటుంబాలను నానా ఇబ్బం దుల పాలు చేస్తున్నాయని  ఆయన తెలిపారు.