calender_icon.png 1 May, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్ ప్రభంజనం

01-05-2025 12:37:05 AM

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30: పదవ తరగతి ఫలితాల్లో ఇబ్రహీంపట్నం శ్రీచైతన్య స్కూల్ ప్రభంజనం సృష్టించింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్ మొత్తం విద్యార్థుల సంఖ్య 57 కాగా, నూటికి నూరు శాతం ఉత్తీర్ణతతో పాటు 550 మార్కులు పైబడి 12 మంది, 500 మార్కులు పైబడి 35 మంది సాధించారు. మొత్తం 61% మంది విద్యార్థులు 500 పైబడిన మార్కులు సాధించారు. మొత్తం విద్యార్థుల సగటు మార్కులు 508 గా ఉంది.

ఇది ఒక అద్భుతమైన రికార్డు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం స్కూల్లో నిర్వహించగా, ఈ సంవత్సరం తమ స్కూల్లో ఉపాధ్యాయుల, విద్యార్థుల కృషితో సాధారణ విద్యార్థుల నుండి సైతం అసాధారణ ఫలితాలు సాధించగలిగి నందుకు తమకు సంతోషాన్ని సంతృప్తిని కలిగించిందని ప్రిన్సిపాల్ లక్ష్మీ నారాయణ తెలియజేశారు.

తెలంగాణా శ్రీచైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ఎజియం సయ్యద్ ఖాశిం అలీ, జోనల్ కోఆర్డినేటర్ దొంతికుర్తి రమేష్ అభినందనలతో జరిగిన ఈ కార్యక్రమంలో డీన్ డి.రాకేష్, వైస్ ప్రిన్సిపాల్ శ్రావణీ, అందరు ఉపాధ్యాయ వర్గం పాల్గొని విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు.

పది ఫలితాలలో రంగారెడ్డి జిల్లాకు 31 ర్యాంక్

రంగారెడ్డి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి ) ఎస్‌ఎస్సి బోర్డు ప్రకటించిన పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పర్వాలేదనిపించారు . పది పరీక్షలకు  మొత్తం 51671 ముందు విద్యార్థుల కు గాను  బాలురు 27,013 బాలికలు 24,658 పరీక్షలు హాజరయ్యారు.

అందులో బాలురు 23281, బాలికలు 22105 మొత్తం 45,386 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 6,285 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. జిల్లాలో 18 పాఠశాలలో  100% ఉత్తీర్ణత సాధించగా... రాజేం ద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు చెందిన కార్తీక్  584 మార్కులతో  జిల్లా టాపర్గా నిలిచారు. 87 శాతం  సాధించి జిల్లాల వారీగా  చూస్తే రంగారెడ్డి జిల్లాకు 31 ర్యాంకు తో సరిపెట్టుకుంది.