03-01-2026 06:13:33 PM
సర్పంచ్ కర్నాటి వెంకన్న
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలకు అందించే పోషకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం జరిగిన ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై పోషకాహారాన్ని పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కేంద్రానికి క్రమం తప్పకుండా హాజరై ప్రభుత్వం అందించే గుడ్లు, బాలామృతం, పాలు, భోజనం వంటి పోషకాహారాన్ని తీసుకోవాలని చెప్పారు. దీనివల్ల చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని, తల్లుల్లో రక్తహీనత తగ్గి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.