23-04-2025 05:06:09 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో కోదాడ పట్టణానికి చెందిన మారగాని నాగరాజు-ఉష దంపతుల కుమారుడు మారగాని జీవన్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆశ్రమంలో అనాధలకు, వృద్ధులకు, మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు మిత్రులు కోండ్రు గోపీనాథ్ పాల్గొని అన్న వితరణ కార్యక్రమం చేశారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ... అన్నదానం పుణ్యకార్యమని ప్రతి ఒక్కరు ఇలా వారి వారి గృహాలలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలాంటి ఆశ్రమాలలో ఉన్న అనాధలకు వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం చేసి వారికి అండగా నిలిచి వారి ఆకలి తీర్చాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆశ్రమాలకు వారి వారికి అవకాశం ఉన్నంత వరకు ఆర్దిక సహకారాన్ని అందించి తోడ్పాటునందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ. ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.