calender_icon.png 24 August, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముజీబ్ ఆధ్వర్యంలో అన్నదానం

22-08-2025 02:08:49 AM

హైదారబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (విజయక్రాంతి): అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సయ్యద్ మాజీదుల్లా హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో గురువారం ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో సుమారు 700 మంది పేద రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర సంఘం కోశాధికారి ఎం సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, కేంద్ర సం ఘం క్రీడా కార్యదర్శి బోలిగిద్ద శంకర్, హైదరాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శి వైదిక శాస్త్ర, టీఎన్జీవో ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ యూని ట్, కార్యదర్శి చంద్రశేఖర్, మహ్మద్ ముస్త ఫా షరీఫ్,

మహ్మద్ హబీబ్ చావుష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి మారం జగదీశ్వర్ మీడియాతో మాట్లాడుతూ కీర్తిశేషులైన తన తల్లిదండ్రుల పేరిట ముజీబ్ మీద వివిధ కార్యక్రమాలు చేపడుతుండటం చాలా సంతోషకర విషయమని కొనియాడారు. డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ తాను భగవంతుడికి సదా రుణపడి ఉంటానని పేర్కొన్నారు.