calender_icon.png 24 August, 2025 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శరణ్య ఆస్పత్రి వార్షికోత్సవం

22-08-2025 02:10:04 AM

హనుమకొండ, ఆగస్టు 21 (విజయక్రాంతి): హనుమకొండ నయీంనగర్‌లోని శ్రీ శరణ్య హాస్పిటల్ 20వ వార్షికోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరం సైతం నిర్వహించారు.

రోగులను పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తక్కువ ఖర్చుతో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని నిర్వాహకులు డాక్టర్ కే ప్రశాంత్, కాక్టర్ నాగార్జునరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.