25-01-2026 12:21:19 AM
ఆరోగ్యానికి మిత్రువా? శత్రువా?
మన శరీర ఆరోగ్యానికి, మనసు సమతౌల్యానికి, జీవకోటి, భూమి ఆరోగ్యానికి కూడా నిర్ణయాధికారిగా ఉండేది మన గట్ మైక్రోబయోమ్. అంటే మన పేగుల్లో నివసించే సూక్ష్మజీ వుల సమూహం. ఇందులో బ్యాక్టీరియాలే అత్యధి కం. వీటి సంఖ్య ట్రిలియన్స్‌లో ఉంటుంది. దాదా పు 40 ట్రిలియన్స్.. మన ఊహకు కూడా అందని సంఖ్య. వైరస్‌లు, ఫంగస్‌లు కూడా ఇందులో ఉంటాయి.
ఇవి మన మానసిక శారీరక ఆరోగ్యానికి మంచి, చెడు రెండూ చేయగలవు. ఇది మనం పుట్టినప్పటినుంచీ తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ విష్ణున్‌రావు వీరపనేని (శ్వాస ఫౌండేషన్ ఫౌండర్, శ్వాస హాస్పిటల్ చైర్మన్, నారాయణగూడ, హైదరాబాద్) చెపుతున్నారు.
ఐదు మూలకాల ప్రభావం
ప్రకృతిలోని ఐదు మూలకాల (భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం) మైక్రోబయోమ్ ఆరోగ్యంగా ఉంటేనే జీవం, భూమి రెండూ ఆరోగ్యంగా ఉంటా యి. ఇవి పరస్పర అనుసంధానమైనవి. ఆహారం ఆరోగ్యాన్ని కాపాడే ఔషధంగా లేదా నశింపజేసే విషముగా మారుతుందా అనేది ఆహారం నాణ్యత, పరిమాణం, తరచుదనం, సమయం, రకం, వ్యక్తి అవసరాలకు అనుగుణత మీద ఆధారపడి ఉం టుంది.
అంటే వయస్సు, బరువు, పరిస్థితి ప్రకారం తినాల్సినంతకు మించి లేదా తక్కువగా తినడం కూడా హానికరం. అందుకే ఏం తినాలి, ఎంత తినా లి, ఎపుడు తినాలి, ఎందుకు తినాలి, ఏం తినకూడ దు, ఎందుకు తినకూడదు అనే అవగాహన అత్యవసరం.
ప్రకృతి వనరులను కలుషితం
ప్రకృతి వనరులను కలుషితం చేయడం వలన పర్యావరణ మైక్రోబయోమ్ దెబ్బతింటుంది. అది చివరికి మన ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది.
సుస్థిరమైన నేల: ఆరోగ్యకరమైన భూమి మైక్రోబయోమ్ ని తయారు చేస్తుంది. ఆరోగ్యకరమైన పంటలకు పునాది వేస్తుంది. శ్రేయస్కరమైన ఆహా రం, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్, మంచి ఆరోగ్యం. ఇదీ భూమికి జీవి ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం. అంటే పంచభూతాలు బాగుంటే జీవుల ఆరోగ్యం కూడా బాగుంటుంది.
పండ్లు, కూరగాయలు
విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి హృద్రోగాలు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తాయి.
పూర్తి ధాన్యాలు: ఓట్స్, క్వినోవా వంటి ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ ఆహారాలు: మన పేగులలో కోట్లాది మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి కీలకం. ప్రోబయోటిక్ ఆహారాలు (పెరుగు, కిమ్చీ, కంబూచా ఊరగాయలు, ఆవకాయలు) మంచి బ్యాక్టీరియా ఇస్తాయి. ప్రీబయోటిక్ ఆహారాలు (వెల్లుల్లి, ఉల్లిపాయ, ముడిబియ్యం, ఓట్స్ అరటిపండు) వాటిని పోషిస్తాయి. ఇవి కలసి గుడ్ బ్యాక్టీరియా ఉత్పత్తులను తయారు చేస్తాయి. నియంత్రణ లేకుండా లేదా ఎక్కువగా తినడం వల్ల ఆహారం మెల్లమెల్లగా మన ఆరోగ్యానికి శత్రువుగా మారుతుంది.
జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం: అధిక చక్కె ర, రసాయనాలు, అనారోగ్యకర కొవ్వులు కలిగి గట్ మైక్రోబయోమ్ను చెడగొడతాయి. దీని వల్ల ఊబకా యం, మధుమేహం, హృద్రోగాలు, క్యాన్సర్, లివర్, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు, అలర్జీలు, ఆస్తమా మొదలైనవి వస్తాయి. అధిక పరిమాణంలో తిన డం, చాలా మంచి ఆహారం కూడా ఎక్కువగా తింటే హానికరం. పెస్టిసైడ్స్, కెమికల్స్ కలిగిన ఆహారం మెల్లిగా అవయవాలను దెబ్బతీస్తుంది. చెడు ఆహా రం ఒక కలుషిత నీరు లీకేజీ లాంటిది మొదట హానిలా అనిపించదు, కానీ కొంతకాలానికి శరీరాన్ని వ్యాధులతో ముంచేస్తుంది.
ఆహార సంబంధ వ్యాధులు.. మరణాలు
ఊబకాయం: 6.2% మహిళలు, 3.5% పురుషులు చెడు ఆహారపు అలవాట్ల వలన.
మధుమేహం: 10% పైగా పెద్దలు అధిక చక్కెర, ప్రాసెస్ ఫుడ్ కారణంగా బాధపడుతున్నారు.
హృద్రోగాలు: మరణాలు గత దశాబ్దాల్లో 12.7% నుండి 24.8% కి పెరిగాయి.
దేశ వ్యాధి భారంలో 56.4% భాగం చెడు ఆహా రం వల్లనే. ఆహార కలుషితం కారణంగా 150 మిలియన్ మంది (2010) బాధితులు, వీరిలో 40% పిల్లలు. 70 శాతం మన దేశంలో నాన్ కమ్యునికేబుల్ డిసీస్ అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల, అంటే ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, గురక మరియు దాని ప్రభావం వంటి వల్ల మరణిస్తున్నారు.
సమతౌల్యం ఆహారమే నివారణ..
ఆహారాన్ని ఔషధంగా మార్చుకోవాలంటే, దాని ని జాగ్రత్తగా, అవగాహనతో తినాలి. శరీర అవసరాన్ని తెలుసుకొని, సహజమైన, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారం తినాలి. నాణ్యత ప్రాధాన్యంగా ఆర్గానిక్, తాజా, పూర్ణ ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫైబర్ ఉన్న ఆహారమే మైక్రోబయోమ్కి శ్రేయస్క రం. ఒకే రకం ఆహారం కాకుండా విభిన్నమైన సహ జ ఆహారం తీసుకోవాలి. ఎక్కువ రకాల సహజ ఆహారం, ఎక్కువ రకాల మంచి బ్యాక్టీరియా ఉన్న ఆహారం తీసుకోవాలి.
ఫైబర్, ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ ఆహారం తినడం ద్వారా జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. పిల్లలకు మొదటి మూడేళ్ళు ఎలాంటి స్వీట్స్, జంక్ ఫుడ్స్ ఇవ్వొద్దు. ఇది మీరు మీ పిల్లల ఇమ్మ్యూనిటి ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి ఇచ్చే అతి పెద్ద బహుమానం. మీరు తినకూడనివి ఎక్కువగా తింటే అర గంట తరువాత ఒక అర గంట సేపు వ్యాయామం లేదా వాకింగ్ చేయండి చాలు. కొంత బరువు తగ్గుతుంది, షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.
భూమి ఆరోగ్యం.. జీవం ఆరోగ్యం
మనసు కలుషితమవడం అనేది అన్ని కాలుష్యాలకు మూలం . గాలి, నీరు, భూమి, శక్తి, అంతరిక్షం, గ్లోబల్ వార్మింగ్ అన్నీ దాని ఫలితాలు. ఆహార కాలుష్యం చివరికి ఆరోగ్య కాలుష్యంగా మారి దేశ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ప్రతి స్థాయిలో వ్యక్తి నుండి కుటుంబం వరకు, సమాజం నుండి దేశం వరకు సరియైన అవగాహన అవసరం. శ్వాస ఫౌండేషన్ ఈ మార్పుకు తన వంతు కృషి చేస్తుంది, ఎన్‌జీవోఎస్, ప్రభుత్య సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది.
డాక్టర్ విష్ణున్ రావు వీరపనేని (శ్వాస ఫౌండేషన్ ఫౌండర్, శ్వాస హాస్పిటల్ చైర్మన్, నారాయణగూడ, హైదరాబాద్)