calender_icon.png 25 January, 2026 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెన్నెముక సమస్యలు.. నివారణ

25-01-2026 12:18:06 AM

ఎండోస్కోపిక్ స్పున్ సర్జరీతో ప్రయోజనాలు

రోడ్డు ప్రమాదాలు, నిశ్చల జీవనశైలి, పెరుగుతున్న ఊబకాయం కారణంగా ప్రజలు అధికంగా వీపు, వెన్నెముక సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా చాలా మంది తాత్కాలిక నొప్పి నివారణ కొరకు, స్వల్పకాలిక ఉపశమనాన్ని అందించే నొప్పి నివారణ మందులు ఫిజియోథెరపీ సెషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎండోస్కోపిక్ స్పున్ సర్జరీ వల్ల ప్రయోజనాలు, ఎలాంటి సందర్భాల్లో చేస్తారో డాక్టర్ విష్ణు మన్యం (కన్సల్టెంట్ మినిమల్లీ ఇన్వాసివ్, ఎండోస్కోపిక్ స్పున్ సర్జన్, రెనోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్) చెపుతున్నారు. 

వెన్నెముక సమస్యలు సర్వసాధారణమైనప్పటికీ, తీవ్రమైన నొప్పి, నరాల దెబ్బతి నడం, వాటి పనితీరు కోల్పోయే వరకు వాటిని తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. సరైన భంగిమ లేకపోవడం, సరికాని లిఫ్టింగ్, తగినంత వ్యాయామం లేకపోవడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. ఈ విధమైన నిర్లక్ష్యానికి ప్రధాన కారణం మనకు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలపై అవగాహన లేకపోవడమే. 

ఎండోస్కోపిక్ స్పున్ సర్జరీ అంటే ఏమిటి?

ఎండోస్కోపిక్ స్పున్ సర్జరీ అనేది మినిమల్లీ ఇన్వాసివ్ ప్రక్రియ, దీనిలో చిన్న కోత ద్వారా ఎండోస్కోప్ను చొప్పించి, హెర్నియేటెడ్ డిస్క్లు లేదా స్టెనోసిస్ వంటి వెన్నెముక సమస్యలను పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియలో సర్జన్ చిన్న కెమెరా మరియు ప్రత్యేక పరికరాలను ఉపయోగించి, వెన్నెముక కండరాలకు తక్కువ నష్టం కలిగిస్తూ, శస్త్రచికిత్స చేస్తారు. దీని ఫలితంగా తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం మరియు వేగవంతమైన రికవరీ వంటి ప్రయోజనాలు ఉంటాయి. 

సర్జరీని ఎలాంటి సందర్భాలలో సూచిస్తారు?

ఎండోస్కోపిక్ స్పున్ సర్జరీని ముఖ్యంగా డిస్క్ జారడం, హెర్నియేటెడ్ డిస్క్, సయాటికా (నడుము నొప్పి), మరియు కణితి వంటి వెన్నెముక సమస్యలకు సూచిస్తారు, ముఖ్యంగా మందులు, ఫిజియో థెరపీ వంటి సాంప్రదాయ చికిత్సలు విఫలమైనప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. 

నిర్ధారణ పరీక్షలు

ఎండోస్కోపిక్ స్పున్ సర్జరీకి ముందు, వైద్యులు వెన్నెముక సమస్యలను నిర్ధారించడానికి రోగికి శారీరక పరీక్ష చేస్తారు, తర్వాత ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్,  డిస్కోగ్రామ్ వంటి పరీక్షలను సూచిస్తారు. ఈ పరీక్షల ద్వారా సమస్య తీవ్రతను అంచనా వేసి, శస్త్రచికిత్సకు స్పష్టమైన ప్రణాళికను రూపొందించడానికి, ఏవైనా ఇతర సమస్యలను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. 

ప్రయోజనాలు.. జాగ్రత్తలు

ప్రయోజనాలు: అత్యంత ఖచ్చితత్వంతో మి.మీ. కంటే తక్కువ కోత, తక్కువ నొప్పి ఉంటుంది. తక్కువ రక్తస్రావం, తక్కువ పోస్ట్-ఆపరేటివ్ వార్డ్ సమయం, అత్యంత వేగంగా కోలుకోవడం, ఆసుపత్రిలో తక్కువ కాలం బస, కండరాలు, ఎముకల నష్టం ఉండదు.

జాగ్రత్తలు: ఎండోస్కోపిక్ స్పున్ సర్జరీ తర్వాత త్వరగా కోలుకోవడానికి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి, వైద్యులు సూచించిన తేలికపాటి వ్యాయా మాలు, ముఖ్యంగా నడక చేయాలి, వెన్నెముకపై ఒత్తిడి కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండా లి, నొప్పిని తగ్గించడానికి కూల్ ప్యాక్లను ఉపయోగించాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.  

వెన్ను నొప్పి యొక్క నివారణ చర్యలు

కాల్షియం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే (తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, అవోకాడో) ఆహారాలు వెన్నుకు మేలు చేస్తాయి. కావున వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మొబైల్ ఫోన్ వినియోగం వెన్నుముకపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మొబైల్ వినియోగంను తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన శరీర బరువును ఉంచుకోవడం మంచింది. సరైన భంగిమలో కూర్చోవడం, పడుకోవడం చేయాలి. అతిగా వ్యాయమాలు చేయడం మానుకోవాలి. గంటల తరబడి వాహనాలు నడపడం మానుకోవాలి. సాధ్యమైనంత వరకు ముందుకు వంగి పనిచేయడం మానుకోవాలి.

ఆర్థరైటిస్ లేదా కొన్ని ఎముక సంబంధ వ్యాధులకు గురికాకుండా జాగ్రతలు తీసుకోడం. ఒత్తిడి, మానసిక పరిస్థితులను నియంత్రించడానికి, విశ్రాంతి కలిగించే వ్యాయామాలు చెయ్యడం మంచింది. మహిళలు ఎక్కువగా ఎత్తు మడిమల చెప్పులు వాడటం తగ్గించుకోవాలి. మధ్యపానం, ధుమపానం ఆర్థరైటిస్కు కారణమయ్యే ఎముక సాంద్రతపై ప్రభావం చూపుతుంది. సరైన భంగిమ పాటించడం, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం.

 డాక్టర్ విష్ణు మన్యం (కన్సల్టెంట్ మినిమల్లీ ఇన్వాసివ్, ఎండోస్కోపిక్ స్పున్ సర్జన్, రెనోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్)