calender_icon.png 1 November, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్!

01-11-2025 01:02:49 AM

  1. కడుపునొప్పి, వాంతులతో 50 మంది విద్యార్థులకు అస్వస్థత
  2. హుటాహుటిన పిల్లలను ఆసుపత్రికి తరలింపు
  3. ఎర్రవల్లి మండలం ధర్మవరంలో ఘటన

గద్వాల, అక్టోబర్ 31 ( విజయక్రాంతి ) : గద్వాల జిల్లా  ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలోని బీసీ బాలుర ప్రభుత్వ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌తో 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి.. వాంతులతో విలవిలలాడిపోయారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు కడుపునొప్పితో పాటు వాంతులు అయ్యాయి.

హుటాహుటిన గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కలుషిత ఆహార ఘటన తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ వెంటనే స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.తమ పిల్లల ఆక్రందనలు చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పేద విద్యార్థులంటే అంత చులకనా అంటూ హాస్టల్ వార్డెన్ పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.