calender_icon.png 1 November, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలి

01-11-2025 01:04:37 AM

  1. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.30 వేల పరిహారం అందించాలి 
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  3. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో పర్యటన

చిట్యాల/మోతె, అక్టోబర్ 31 (విజయక్రాంతి): తుఫాను ప్రభావంతో తడిసిన ధా న్యానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. పంట నష్టపో యిన ప్రతి ఎకరాకు రైతుకు రూ.30 వేల పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేలమట్టమైన పంట పొలాలను రైతులతో పరిశీలన చేశారు. యాదాద్రి జిల్లా చిట్యాల కేంద్రంలో భువనగిరి రోడ్‌లో గల ఐకెపి సెంటర్‌ని శుక్రవారం సందర్శించి, భారీ వర్షాలకు నష్టపోయిన రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా తడిసిన ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. ఐకెపి కేంద్రాలలో వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అక్కడ సరైన వసతులు కల్పించి ఉంటే రైతులు ఇంతగా నష్టపోయే అవకాశం ఉండేది కాదన్నారు.

రైతులకు ధాన్యం తడవకుండా ఉండడానికి టార్ఫాలిన్ కవర్లు ఏర్పాటు చేయడంలోనూ, ధా న్యం  తూర్పార పట్టుటకు ఫ్యాన్లు, సరైన వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతాంగం అంతా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనాలని, లేని యెడల బిజెపి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.