10-08-2025 06:18:50 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయడం వల్ల ఆహార భద్రత లభిస్తుందని ఇనుగుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కూరెల్లి సతీష్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలో పేదలకు కొత్తగా మంజూరైన రేషన్ కార్డు ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ... సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, పేదలకు సన్న బియ్యంతో కడుపునిండా అన్నం పెట్టాలని సంకల్పంతో కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించామని చెప్పారు.